Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ కె.చంద్రారెడ్డి
- ఆన్‌లైన్‌లో రుణాలకు దరఖాస్తులు
నవతెలంగాణ - నారాయణపేట టౌన్
చిరు వ్యాపారుల అభివృద్ధికి అదికారులందరూ కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ కె.చంద్రా రెడ్డి సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసన్న కుమార్‌తో కలిసి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ఉండే వ్యాపారులు బ్యాంకులో రుణాల కోసం ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తులు చేసు కోవాలన్నారు. మున్సిపాలిటీలో పేరుకుపోయి న పాత బకాయిలను సెప్టెంబర్ 15లోపు ఒకే విడతలో చెల్లించే విధంగా సంప్రదింపులు చేయాలని ఆదేశించారు. పట్టణాలలో వార్డుల వారీగా ట్రీ పార్కులు, నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. పురపాలక సంఘానికి సంబం ధించిన ఆస్తుల వివరాలు తయారు చేసి నెల నెలా చూపించాలని సూచించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ వీధి వ్యాపారులకు రుణాల కోసం వచ్చే వారు ఒకే సారి అందరూ రాకుండా విడతల వారీగా పది మంది చొప్పున రావాలన్నారు. అలా రావడం వల్ల వాటిని పరిశీలించేందుకు సులువుగా ఉంటుందని, రుణాలు త్వరగా మంజూరు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాసులు, పావని, కష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.