Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5 గేట్లు ఎత్తి నీరు విడుదల
- ఇన్‌ఫ్లో 65వేల క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 56, 980వేల క్యూసెక్కులు
- ప్రస్తుతం 7.798టీఎంసీలు
నవతెలంగాణ - ధరూర్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వరప్రదాయిని అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు స్పల్పంగా వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి స్వల్పంగా నీరు చేరుతుండడం తో అదే స్థాయిలో దిగువన ఉన్న జూరాలకు నీ టిని విడుదల చేశారు. దీంతో ఎగువ నుంచి 65వేల క్యూసెక్కుల నీరు రావడంతో 5గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. నారా యణపూర్ నుంచి 31వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా అదే స్థాయిలో 56, 980 క్యూ సె క్కుల నీటిని కిందకు వదులుతున్నారు. జూ రాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.615 టీఎం సీలు కాగా ప్రస్తుతం 7.798 టీఎంసీల నిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 34వేల క్యూ సెక్కుల నీటిని పవర్ హౌస్ ద్వారా వదులు తున్నారు. దీని ద్వారా ఐదు యూనిట్లలో 195 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు అధి కారులు తెలిపారు. యథావిధిగా జూరాల నుం చి నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, భీమా -1కు 0, భీమా -2కు 0క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 700 క్యూసె క్కులు, కుడి కాల్వకు 718 క్యూసెక్కులు, కో యిల్ సాగర్‌కు - 315 క్యూ సెక్కులు, సమాం తర ప్యానల్ ద్వారా 300 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మొత్తం మీద దిగువ ప్రా ంతానికి 56, 980 క్యూ సెక్కుల నీటిని వదిలి నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.