Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ధరూర్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వరప్రదాయిని అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ కురు స్తున్న వర్షాలకు ఎగువ ప్రాజెక్టుల్లోకి భారీ స్థా యిలో వరద నీరు చేరడంతో నారాయణపూర్ నుంచి అదే స్థాయిలో దిగువన ఉన్న జూరాల కు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఎగువ నుంచి 3లక్షల 17వేల క్యూసెక్కుల నీరు రావ డంతో 39గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులు తున్నారు. నారాయణపూర్ నుంచి 2లక్షల 72, 217క్యూసెక్కుల నీరు వస్తుండగా అదే స్థా యిలో 3లక్షల 16, 258క్యూసెక్కుల నీటిని కి ందకు వదులుతున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.615టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.631 టీఎంసీల నిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 21వేల క్యూసెక్కుల నీటిని పవర్ హౌస్ ద్వారా వదులుతున్నారు. దీని ద్వారా నాలుగు యూనిట్లలో 142మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు తెలిపారు. యథా విధిగా జూరాల నుంచి నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, భీమా -1కు 0, భీమా -2కు 0క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 700 క్యూసె క్కులు, కుడి కాల్వకు 237 క్యూసెక్కులు, కోయిల్ సా గర్‌కు - 0 క్యూసె క్కు లు , సమాంతర ప్యానల్ ద్వా రా 300 క్యూసెక్కుల నీ రు విడుదల చేస్తున్నా రు. మొత్తం మీద దిగు వ ప్రాంతానికి 3లక్షల 16, 258క్యూ సెక్కుల నీటిని వదిలినట్లు అధికా రులు తెలిపారు.