Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోగులను కాపాడాల్సిన వైద్యులు రోగుల పట్ల వివక్ష చూపుతున్నారు. కరోనా నేపథ్యంలో రోగులకు సరైన వైద్యం అందడం లేదనడంలో సందేహం లేదు. ఒక వైపు కరోనా మరోవైపు నెల రోజులుగా కురుస్తున్న వర్షాలు రోగులను ఇంటికే పరిమితమయ్యేలా చేశాయి. ఎవరికి కరోనా పాజిటివ్ ఉందోననే వాటిపై వైద్యులు ఆరా తీయడంలేదు. వివిధ రోగాలతో ఆస్పత్రికి వచ్చే రోగుల నాడీ కూడా చూసేందుకు విముఖత చూపుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అనేక రోగాలు ప్రజలను చుట్టుముట్టాయి. ఈ క్రమంలో వైద్యులు కరోనా సాకుతో వారిని చూడడంలేదనే విమర్శలున్నాయి. దీంతో గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధిగ్రస్తులు మంచానికే పరిమితమౌ తున్నారు. ఆయాసం అధికమై ఆస్పత్రికెళ్తే కరోనానేమోనని చూసేందుకు జంకుతు న్నారు. వీర ప్రవర్తనతో అనేక మంది రోగులు ఆస్పత్రులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదు. ఒకవైపు ప్రభుత్వం రోగుల పట్ల వివక్ష చూపరాదని చెబుతున్నా అందుకు విరుద్ధంగా వైద్యులు ప్రవర్తించడం పట్ల ప్రజలు, రోగులు మండిపడుతున్నారు.
నవతెలంగాణ - మహబూబ్‌నగర్
ప్రాంతీయప్రతినిధి