Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్
నవతెలంగాణ-అలంపూర్
గ్రామాల్లో పెత్తందార్లను ఐక్యతతో ఎదిరిం చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.డి.జబ్బార్ ప్రాగటూరు గ్రామ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆదివారం ప్రాగటూరు గ్రామంలో ఆయన సందర్శించి సిపిఎంకు చెందిన ఎంపిటిసి భూమిపై కాంగ్రెస్ పెత్తందార్లకు మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి గ్రామస్తులతో సమా వేశం ఏర్పాటు చేసి తెలుసుకున్నారు. అనంత రం గ్రామస్తులతో మాట్లాడుతూ ఎంపిటిసికి సంబంధించిన భూమి గత 35 సంవత్స రాలుగా పంటలు వేసు కుంటున్నారని అయితే గ్రామంలోని కాంగ్రెస్ పెత్తం దార్లు ఓర్వలేకే భూమిపై వివాదం చేస్తున్నారని ప్రజలు తెలిపారు.
గ్రామం గత ఇరవై సంవత్స రాలుగా పెత్తందార్ల చేతిలో ఉండి అభివృద్ధికి దూరంగా ఉండదన్నారు. సిపిఎం పార్టీ ప్రజల ప్రతినిధులు ప్రజలకు బాధ్యతగా ఉండి పని చేస్తారని పేర్కొన్నారు. పార్టీ నుండి ఎంపిటిసి, సర్పంచ్‌గా గెలిచినందుకే గ్రామ పెత్తందార్లు ఎదుగుదలను ఓర్వలేక 30 సంవత్సరాలుగా సాగు చేసుకుం టున్న భూమిపై తప్పుడు పత్రాలు సృష్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇలాంటి పెత్తందార్లను సిపిఎం అనేక మందిని చూసింద న్నారు. నిజాం నవాబు కాలంలో ప్రజలను ఐక్య త చేసి వారికి పంచి ఇచ్చిందన్నారు. కృష్ణానది పరివాహాక ప్రాంతంలోని ముంపుకు గురైన భూమి ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. సాగు చేసు కున్న రైతులకు చెందుతుందన్నారు. ప్రాగటూరు పెత్తం దార్లు హైదరబాద్‌లో ఉంటూ భూమిని గుప్పిట్లో ఉంచుకున్నారని అన్నారు. సిపిఎం ప్రజాప్రతినిధులు చేస్తున్న అభివృద్ధి చేస్తున్న ఓర్వలేక ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు.
వారి ధన బలంతో పోలీ సులు ,రెవెన్యూ అధికారులను గుప్పిట్లో ఉంచుకుని భయాభ్రం తులకు గురిచేస్తే పోరాటం తప్పదని హెచ్చరిం చారు. అనంతరం ఎంపిటిసి భూమిని పరిశీలిం చారు. కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటస్వామి, డివిజన్ కమిటీ సభ్యులు దేవదాసు, రాజు, మద్దిలేటి, లక్ష్మన్న, సర్పంచ్ రాధమ్మ, తిరుపతమ్మ తదితరులు ఉన్నారు.
కాస్తులో ఉన్న వారికే భూమి చెందుతుంది
కాస్తులో ఉన్న రైతులకే ముంపు భూమి చెందుతుందని,దీనిపై గ్రామానికి చెందిన పెత్తందార్లు సుధాకర్ రెడ్డి సిపిఎం ప్రజా ప్రతిని ధులపై కక్ష కట్టి వివాదం సృష్టిస్తున్నారన్నారు. జిల్లాలో 90 శాతం పంటలు వర్షం కురవక పండలేదని పేర్కొన్నారు.
కరువు జిల్లాగా ప్రకటించడంలో ప్రభు త్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి నేటికీ నెరవేర్చడం లేదన్నారు. ఒకేసారి రుణ మాఫీ చేసి ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటస్వామి,నాయకులు రాజు,వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.