Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రామనామ స్మరణతో మారుమోగిన ఆలయం
-అధిక సంఖ్యలో హాజరైన భక్తులు
నవతెలంగాణ-వంగూరు
రామ ...రామ... అంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో అపర భద్రాద్రిగా పేరొందిన సిర్సనగండ్ల గుట్టపై వెలసిన సీతారామచంద్రస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేం దుకు జిల్లా నలుమూలల నుండి కాకుండా రాష్ట్ర నలు మూలల నుండి కూడా వేలసంఖ్యలో హాజరై జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ రథోత్సవాన్ని ఆనందోత్సవాల మద్య లాగుతూ సిర్సనగండ్ల గుట్టను రామనామ స్మర ణతో మారుమోగించారు. వంగూరు మండల పరిధి లోని సిర్సనగండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని సిర్సన గండ్ల గుట్టపై బ్రహ్మోత్సవాలు గత ఐదు రోజులుగా అంగరంగవైభవంగా కొనసాగాయి.
అందులోభాగంగా సోమవారం అర్ధరాత్రి 4.30గంటలకు రథోత్సవ కార్యక్రమం రంగురంగుల పూలతో మామిడి తోరణాలతో హైందవ సాంప్రదాయ బద్ధంగా ద్వజాలను రథంపై పెట్టి వేదపండితుల మం త్రోచ్ఛరణల మద్య మంగళవాయిద్యాలతో పురోహి తులు రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనం తరం భక్తులు రథోత్సవాన్ని గుట్టపై ఉన్న శివాలయం వరకు లాగుతూ శ్రీరామ నామస్మరణతో ఆనందోత్స వాల నడుమ రథోత్సవాన్ని లాగారు. సుమారు రెండు గంటల సమయంలో భక్తులు ఆనందోత్సవాల మద్య రథోత్స కార్యక్రమాన్ని కన్నుల పండువగా జనసందో హం మధ్య నిర్వహించారు.
పోలీసుల భారీ బందోబస్తు...
సిర్సనగండ్లలో నిర్వహించిన రథోత్సవ కార్యక్రమం లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా కల్వకుర్తి సీఐ గండికోట వెంకట్, వంగూరు ఎస్.ఐ నరేష్, మిడ్జిల్ ఎస్‌ఐ, వెల్దండ ఎస్‌ఐ జానకి రామ్, కల్వకుర్తి ఎస్‌ఐ జలేందర్‌రెడ్డితోపాటు సుమారు 150మంది సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాత్రింబవళ్లు పర్యవేక్షించారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి దొంగతనాలు జరుగ కుండా పక్కా నిఘా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు పోలీసులు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగ కుండా ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్టు ఆయన తెలిపారు. వాహనాలను నిలిపేందుకు ప్రత్యేక పార్కిం గ్ ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ డేరం మల్లిఖార్జునశర్మ, ఈఓ నిరంజన్, సర్పంచ్ యాతం శారదశ్రీనివాస్, ఉత్సవ కమిటీ చైర్మన్ విజేం దర్‌గౌడ్, చారకొండ సర్పంచ్ శిల్పదేవిలాల్‌చౌహాన్, నాయకులు గురువయ్యగౌడ్, సమరంగౌడ్, రాములు గౌడ్, గజ్జె యాదయ్య, వెంకటయ్య, రాజేందర్‌రెడ్డి, ప్రవీన్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, మదుకర్‌రెడ్డి పాల్గొన్నారు.