Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముదిరాజ్ యువజన సంఘం జిల్లా
అధ్యక్షుడు శివప్రసాద్
నవతెలంగాణ-కల్వకుర్తి
ముదిరాజ్‌ల అభివృద్ధ్ది విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ముదిరాజ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీపురం శివప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్‌లలో ఒక వర్గానికి చెందిన మత్య్స కారులకు కోట్లు కేటాయిస్తూ మరో వర్గానికి చెందిన వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ముదిరాజ్‌ల పేరుతో మూడు, నాలుగు గ్రూపులు కొనసాగుతున్నాయని, నిజమైన ముదిరాజ్‌లకు అభివృద్ధి విషయంలో తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్‌లలో మిగిలిన వర్గాలు సేవకులు, బంటు, కావలి, కొలి, మొదలగు వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ వర్గాలకు ఎలాంటి కులవృత్తి లేదని వారి ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే వీరు గుర్తొస్తున్నారని, ఆ తర్వాత పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన ముదిరాజ్‌లకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఆయన ప్రకటనలో డిమాండ్ చేశారు.