Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కల్వకుర్తి
ఆయా పార్టీల నాయకులకు మున్సిపల్ ఎన్నికల ఫీవర్ పట్టుకుంది గత ఆరు నెలలుగా అదిగో వచ్చే ఇదిగో వచ్చే ఎన్నికలు అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని పార్టీల నాయకులు కండ్లలో వత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.
కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికలు రెండో విడతలో జరిగే అవకాశాలు ఉన్నట్టు రాజీకీ య విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మొదటి విడత మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయడమే కాకుండా నోటిఫికేషన్ విడుదలకు ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమయ్యరు. నవంబర్ మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అందరూ ఆశించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యం లో నోటిఫికేషన్ వాయిదా వేసినట్టు చర్చ
జరుగుతోంది.కల్వకుర్తి మున్సిపాలిటీలో వార్డుల విభజనలో అవకతవకలు చోటుచేసుకున్నాయని పట్టణానికి చెందిన పలువురు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వార్డుల విభజనకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని కోర్టు కోరింది. ఈ నేపథ్యంలో కల్వకుర్తి మున్సిపాలిటీ అంశం కోర్టులో ఉన్నందున రెండో విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని ప్రజా ప్రతినిథులు అంటున్నారు. అన్ని వివరాలు ఉన్నటువంటి మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎన్నికలు రెండు విడతలుగా
నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఎన్నికల కోసం
ఆశావాహుల ఎదురుచూపు
కల్వకుర్తి
మున్సిపాలిటీ పరిధిలో ఆశావాహులు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్ ,కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆయా పార్టీల నాయకులు మొదటి విడత ఎన్నికల ప్రచారం సైతం పూర్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటేందుకు అన్ని పార్టీల వూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి ఎడమ సత్యం ,కాంగ్రెస్ నుంచి ఆనంద్ కుమార్ మున్సిపల్ చైర్మెన్ రేసులో ఉన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కల్వకుర్తి పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈసారి మున్సిపాలిటీ పై జెండా ఎగురవేసేందుకు ఆయా పార్టీలు సిద్ధమవుతున్నాయి.
పేరుకుపోయిన సమస్యలు...
ఆరు నెలలుగా కల్వకుర్తి మున్సిపాలిటీకి పాలకవర్గం లేకపోవడం వల్ల ప్రజలు పాలనాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. మున్సిపల్ కమిషనర్ లేకపోవడంతో ఆరునెలలుగా ఇన్‌చార్జి అధికారితోనే పాలన కొనసాగుతోంది. దీంతో ప్రజా సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ డ్రయినేజీల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి.పట్టణంలో మురుగు కూపాలుగా మారి దోమలకు, పందులకు నివాసాలయ్యాయి. దీంతో పట్టణంలో అంటువ్యాధులు ప్రబలి ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రెగ్యులర్ కమిషనర్‌ను నియమించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయం.