Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధరూర్
సీడ్ పత్తి రైతులకు ఆర్గనేజర్లు చేస్తున్న మోసాలను అరికట్టాలని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డ రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్‌ను శనివారం ముట్టడించారు. ప్యాకెట్ పత్తి ధర రూ.490 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు నెలల నుంచి జిల్లా నడిగడ్డ రైతుల హక్కుల పోరాట సమితి చైర్మన్ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో సీడ్ పత్తి రైతుల పోరాటం కొనసాగుతోంది. ఆర్గనేజర్లు చేస్తున్న మోసాలను అనేక కార్యక్రమాలు ద్వారా అధికారుల దృష్టి తీసుకెళ్లారు. అయినా స్పందన లేకపోవడంతో శనివారం రైతులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడించారు. కలెక్టర్ బయటికి వచ్చి తమ సమస్యలను విని పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. జోగులాంబ గద్వాల జిల్లా ప్రాంతంలో కేవలం 50మంది ఆర్గనేజర్లు రైతులకు మోసం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టం కనిపిస్తుందన్నారు. రెండు వారాల క్రితం నడిగడ్డ రైతుల పోరాట సమితి ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలో పాత బస్టాండ్ సమీపంలో మూడు వేల మందితో ధర్నా చేసి, రైతులకు జరుగుతున్న మోసలపై జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశామన్నరు. కలెక్టర్ రైతుల హామీలు పరిష్కరిస్తానని ఇప్పటికీ పరిష్కరించల ేదన్నారు. రైతులు నిరుత్సాహం చెందకుండా పోరాటం చేయాలని కోరారు. సమస్యలు పరిష్కారం చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.