Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వంగూరి రాములు
నవతెలంగాణ- నాగర్‌కర్నూల్
తెలంగాణ రాష్ట్రంలో గత 43 రోజుల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టిసీ ప్రైవేటీకరణ ఆలోచన వెంటనే మానుకోవాలని కార్మికులు సమ్మె చేస్తున్నారని అందులో భాగంగా ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఆర్టిసి కార్మికులకు మద్ధతుగా ఒక్కరోజు సామూహిక నిరాహార దీక్షలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వంగూరు రాములు అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం యూనియన్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1947 పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం సమ్మె నోటీసు ఇచ్చి సమ్మె నిర్వహిస్తుంటే సమస్యలు పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి.. సమ్మెను నిర్వీర్యం చేయడానికి అనేక రకాల కొత్త పదాలు వాడుతూ 23మంది కార్మికుల చావుకు కారణమయ్యాడని వాపోయారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కార్మికులతో చర్చలు జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వర్ధం పర్వతాలు, ఆర్ శ్రీనివాసులు, జిల్లా సహాయ కార్యదర్శి పి రామయ్య, ఉపాధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.