Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్వకుర్తి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వంద శాతం ఫలితాలు వచ్చే విధంగా అధ్యాపకులు కషి చేయాలని నాగర్‌కర్నూల్ డీఐఈఓ వెంకటరమణ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు పట్టిక తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ఉన్నతమైన విద్యాబోధన చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రయివేటుకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వెల్లడిం చారు. అధ్యాపకులు మరింత పట్టుదలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యానందించాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వేణు నాగర్‌కర్నూల్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్యాపకులు మహేష్‌గౌడ్, రమాకాంత్, జుబేర్, సదానందంగౌడ్, మల్లేష్ పరశురాం శ్రీనివాస్ పాల్గొన్నారు.