Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగా-కొత్తకోట
అధికారులు సమన్వయంతో పని చేయాలని వనపర్తి కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. కొత్తకోట మున్సిపాలిటీ పక్షం రోజుల ప్రణాళికలో భాగంగా శనివారం మండలపరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీలోని 15 వార్డుల్లోని మురుగు నీరు కాల్వలు, మురుగు కాలువల విస్తీర్ణం, మురుగుపై పారిశుధ్య కార్మికుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ సేకరణతో పాటు పట్టణంలో పందుల నిర్మూలన, హరితహారం ద్వారా నాటిన మొక్కల వివరాలు, పట్టణంలోని నివాసాల మద్యవున్న ఖాళీ స్థలాల వివరాలపై చర్చించారు. పట్టణ అభివద్ధికి అయ్యే వ్యయాలను దష్టిలో ఉంచుకొని అధికారులు యంత్రాల సహాయం, కార్మికులకు..అయ్యే బడ్జెట్ అనుగుణంగా ఉపయోగించుకోవలన్నారు. పట్టణాభివద్ధికి అవరోధకంగా ఉన్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డంపుయార్డుకు స్థల సేకరణ, పట్టణంలో పందులు సంచరించకుండా చర్యలు, పట్టణానికి దూరంగా వాటికి షెడ్ల నిర్మాణానికి స్థల సేకరణపై తహసీల్దార్ శంకర్‌ను అడిగి తెలుసుకున్నారు. అత్యవసరమైన చోట మురుగు కాల్వల పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అధికారుల మధ్య సమన్వయం లోపించిందని అసహనం వ్యక్తం చేశారు. మెప్మా ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం, తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియ, హరితహారం, బట్ట సంచుల వాడకంవంటి అంశాల పట్ల పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం మున్సిపాలిటీలోని బస్టాండ్ వెనుక భాగంలో కుప్పలుగా పడివున్న ప్లాస్టిక్ కవర్లు అందులో పందులు దొర్లాడుతుండటం చూసిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ ప్రత్యేక అధికారి కోదండరాములు, కమిషనర్ కతలప్ప, తహసీల్దార్ శంకర్, మెప్మా అధికారి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.