Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చిన్నంబావి
పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం జ లాశయం నుంచి 80వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు తీసుకొచ్చిన జీఓ203తో నీటి ఉద్యమమం తప్పదని గొందిమల్ల - వెల్టూరు సాధన సమితి నాయకులు మాదాసి కురువ పెద్ద మల్లయ్య, పెరుమాళ్ల శ్రీనివాసులు అన్నా రు. ఈ మేరకు మండల కేంద్రంలోని సునీత ఫంక్షన్ హాల్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో 'కృష్ణా నది నీళ్లు- తెలంగాణ హక్కు'పై ఆదివారం నిర్వహించిన చర్చావేదికలో వారు మాట్లాడా రు. నాలుగు దశాబ్ధాలుగా నీటి విషయంలో పాలమూరు జిల్లా అన్యాయానికి గురౌతూనే ఉందన్నారు. నీటి వాడకం విషయంలో తెలం గాణ రాష్ట్రం పూర్తిగా విఫలమైందన్నారు. దక్షి ణ తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆది నుం చి ఆయా ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శి స్తున్నాయని, ప్రస్తుతం కూడా అదే పరిస్థితి నెలకొందని వాపోయారు. ఎలాంటి అనుమ తుల్లేకుండా నీటి వినియోగానికి సంబంధించి 203జీఓను తీసుకొచ్చి జల దోపిడీ చేసే యో చనలో ఉందని విమర్శించారు. ఈ విషయం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదో అర్థం కావడంలేదన్నా రు. కష్ణానదికిరువైపులా తెలంగాణ జిల్లాలు న్నా ప్రాంతం వెల్టూర్ - గుందిమల్ల ప్రాంత ంలో బ్యారేజి నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటు ందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపునకు గురై న 4 నియోజకవర్గాలైన గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్‌లకు సాగునీరు అందక పొలాలు బీళ్లుగా మారుతున్నాయన్నారు. సు మారు 65 గ్రామాలు కోల్పోయిన ఉమ్మడి పా లమూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ను పూర్తి చేసి కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. పై నాలుగు నియోజకవర్గా ల్లో వివిధ ప్రాజెక్టుల కింద ఆర్డీఎస్, జూరాల, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలో చివరి ఆయకట్టుగా మిగిలిన వీపనగండ్ల, చిన్నంబా వి, పెంట్లవెల్లి, అలంపూర్, ఉండవెల్లి, మాన వపాడు, పెబ్బేరు తదితర మండలాలతో పా టు కేఎల్‌ఐ ఆయకట్టు, సింగోటం రిజర్వాయ ర్‌కు సైతం వెల్టూరు - గుందిమల్ల ప్రాజెక్టు నుంచి సాగునీటిని అందించవచ్చన్నారు. బ్రిడ్జి నిర్మాణంతో దక్షిణ తెలంగాణ వాటాగా మరో 50 టీఎంసీల కష్ణా నీటిని ఉపయోగించు కోవ చ్చని, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ము ందుకు రావాలని డిమాండ్ చేశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కేటాయించిన 40 టీఎంసీల నీటిని వాడుకోవడంలో, మినీ రిజ ర్వాయర్ల నిర్మాణంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. కల్వకుర్తికి కేటాయించిన 40 టీఎంసీలలో 20 టీఎంసీల నీటిని ఈ నూతన బ్యారేజిలో నిల్వ చేసుకోవచ్చని, ఆ నీటిని సింగోటం రిజర్వాయ ర్, చిన్నంబావి మండలం మీదుగా తరలించ వచ్చన్నారు. ప్రాజెక్టు నిర్మాణం అనంతరం మ రో కాలేశ్వరం మాదిరిగా ఎత్తిపోతల పథకాల ను నిర్మించి ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు సాగునీటిని ఎత్తి పోయవచ్చని తెలియజేశారు. దీంతో నిరంతరం ఉమ్మడి పాలమూరు జిల్లా పాడి పంటలతో కళకళలాడుతుందని అభిప్రా యం వ్యక్తం చేశారు. ఏపీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని జీవో 203ను ఉపసంహరించు కోవాలని, ఆ ప్రభుత్వంపై కేంద్ర జలవనరుల శాఖ, కష్ణ ట్రైబ్యునల్ బోర్డుకు సాధన సమితి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నీటి పంపకాల విషయంలో కష్ణా బోర్డు వ్యవ హరిస్తున్న నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టులో సైతం న్యాయపోరాటం చేస్తామన్నారు. ఆంధ్ర ప్రభు త్వం జల దోపిడీకి పాల్పడుతున్నా ప్రజా ప్రతి నిధులు నోరు మెదపకపోవడం దారుణమన్నా రు. అందువల్ల సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న నీటి ఉద్యమానికి నియోజకవర్గ పరిధిలోని ఆయా పార్టీల నాయకులు ప్రజా సంఘాలు, మేధావులు, కలిసి రావాలని పిలు పునిచ్చారు. చర్చావేదికలో బీఎస్పీ తాలూకా నాయకులు బూరుగుల మునుస్వామి, సంఘ ం కష్ణ, టీఆర్‌ఎస్ నాయకులు పసుపుల నర్సిం హ, రామన్ గౌడ్, నంది సత్య రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వీపనగండ్ల మండల అధ్యక్షులు గోదాల బీరయ్య, చిన్నంబాయి మండలాధ్య క్షు లు చంద్రశేఖర యాదవ్, అంబేద్కర్ యువజ న సంఘం నాయకులు బూర్గుల వెంకట్, తలారి సాంబశివుడు, సంజీవ, కిరణ్ కుమార్, గొందిమల్ల సాధన సమితి నాయకులు పెరు మాళ్ల తిరుపతి, శ్రీశైలం నిర్వాసితుల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కేసీ రెడ్డి దామోదర్ రెడ్డి, రా మచంద్ర సాగర్, రాజేశ్వర్ సాగర్, మల్లేశ్వరం సర్పంచ్ నాగరాజు, నారెడ్డి సత్య రెడ్డి, వెంకటే శ్వర్ రెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి పాల్గొన్నారు.