Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లాలో కఠిన చర్యలు చేపట్టి పెద్ద మొత్తంలో పాజిటివ్ కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఎస్ వెంకటావ్రు అన్నారు. సోమవారం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో జిల్లాకు వచ్చిన వలస కార్మికులను హౌమ్ క్వారంటైన్ చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతులు కల్పింస్తున్నామన్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు మాస్కులను, శానిటైజర్లను అందజేసినట్లు తెలిపారు. కరోనా సమయంలో మంచి నీటి సరఫరా, విద్యుత్ సరఫరాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా ఆయా శాఖలు పని చేశాయని కొనియాడారు. వర్ష్షా కాలం రానున్న తరుణంలో రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని , నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, అడిషనల్ కలెక్టర్ మోహన్ లాల్, జడ్పీ సిపిఓ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జడ్పీటీసీలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నార