Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో రైతులు పండించే పంటలకు త్వరలో సెజ్ రానుందని, జిల్లాలో 88 క్లస్టర్లున్నాయని, ప్రతి క్లస్టర్‌లో రైతు సమన్వయ సమితి భవనం నిర్మాణాలు చేపట్టాలని ఎక్సైజ్ క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ సంబంధిత అధికారు లను ఆదేశిం చారు. రైతులకు ఎటువంటి సమస్య ఐనా ఎదురైతే జిల్లా మండల స్థాయి లో అదే విధంగా గ్రామ స్థాయిలో ఉండే రైతు సమన్వయ సమితి ద్వారా పరిష్క రించాలని అన్నారు. శనివారం నియోజకవర్గ రైతులతో స్థానిక సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వానాకాలం 2020 వ్యవ సాయ కార్యాచరణ, నియంత్రిత వ్యవసాయ విధానంపై అవగాహనా సదస్సును మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బ Ûంగా మాట్లాడుతూ తెలంగాణ నుండి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేలా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే పలు మార్పులకు శ్రీకారం చుడు తున్నట్లు తెలిపారు. రేపటి నుండి క్లస్టర్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిం చాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. వ్యవసాయా నికి కరెంటు, విత్తనాలు, ఎరువులు, రుణాలను రైతులకు అందిస్తామని అన్నారు. గ్రామంలోని రైతులందరూ ఒకే పంటను వేయ కుండా వేర్వేరు పంటలు పండిం చాలని తెలిపారు. మహబూబ్ నగర్ చుట్టుప్రక్కల ప్రాంతాలలో వెయ్యి ఎకరాల స్థలంలో ఫుడ్ పార్క్ వస్తున్నందున రైస్ మిల్లు, పప్పు మిల్లు, ఆయిల్ మిల్లు, గోదాములు వంటి ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ప్రతి రైతుకు రైతు బంధు అందేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు చూడాలని మంత్రి సూచించారు. మేలు రకమైన పండ్ల తోటలు, కూరగాయల తోటలు పండించుటకు ఉద్యాన శాఖ వారితో చర్చించి వంగాడాలను అందించే విధంగా చూడాలని తెలిపారు. రాబోయే రోజులలో మహబూబ్ నగర్ జిల్లాను హైదరాబాద్‌కు సమానంగా తీర్చిదిద్దడానికి కషి చేస్తామని తెలిపారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, డిసిసిబి వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, జెడ్పీటీసీలు, ఎంపీ పీలు, వైస్ ఎంపీపీ లు, ఎంపీడీ వోలు, తహసీల్దార్లు, రైతులు, సంబ ంధిత అధికారులు పాల్గొన్నారు.
ముస్లింలకు రంజాన్ తోఫాపంపిణీ
పెబ్బేర్ : పెబ్బేరు పురపాలక కేంద్రంలోని మాజీ మార్కెట్ చైర్మన్ బుచ్చారెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్బ Ûంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది రంజాన్ పండుగకు ముస్లిం సోదరులకు బుచ్చారెడ్డి సోదరులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసే వారని కరోనా నేపథ్యంలో పండగ సరుకులతో కూడిన తోఫా అందిం చడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో అలం పూర్ ఎమ్మెల్యే అబ్రహం ,విండో చైర్మన్ కోదండరామ్ రెడ్డి, పురపాలక చైర్‌పర్సన్ కరుణశ్రీ, వైస్ చైర్మన్ కర్రె స్వామి ఎంపీపీ ఆవుల శైలజ జెడ్పిటిసి పద్మా వెంకటేష్ టిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు