Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిమ్మాజీపేట
రైతులకు సేవ చేసినప్పుడే ప్రజాప్రతినిధుల జన్మ ధన్యం అవుతుందని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (గోరిట)కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల అవగాహనా సదస్సులో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, డీసీసీబి డైరెక్టర్ , పీఏసీఎస్ చైర్మన్ జక్కా రఘునందన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తిమ్మాజీపేట మండలంలోని రైతులందరూ పంట మార్పిడిలపై దష్టి పెట్టాలని సూచించారు. ప్రతి సారి ఒకటే పంట వేయకుండా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటను వేయాలని తెలిపారు. అవసరమైతే రాజేంద్రనగర్ పాలెం నుండి వ్యవసాయ శాస్త్రవేత్తలను పిలిపించి ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. అలాగే రైతుల పంట పొలంలో ఎలాంటి పంట పండుతుందో వ్యవసాయాధికారులు భూసార పరీక్షలు నిర్వహించి తెలుపుతారని అన్నారు.. తిమ్మాజీపేట్ సొసైటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఒకటి ఎరువుల దుకాణం ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, ఎరువుల అమ్మే విధంగా ఏర్పాటు చేయాలి అని సూచించారు, త్వరలో రైతులతో ప్రతి గ్రామంలో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని తెలిపారు. త్వరలో రైతులకు గోల్డ్ లోన్స్ క్రాప్ లోన్స్ ఇతర లోన్స్ ఇచ్చేందుకు తిమ్మాజీపేట్ సొసైటీ సిద్ధంగా ఉందని తెలిపారు. మండలంలో సొసైటీ ఆధ్వర్యంలో గత ఏడాది లో 90 వేల బాగ్స్ కొనుగోలు చేస్తే ఈ ఏడాది ఇప్పటివరకు 2 లక్షల 10 వేల ధాన్యం బాగ్స్ కొనుగోaలు ఇంకా 40 వేల బాగ్స్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు . అనంతరం ఎమ్మెల్యే సొసైటీలో కొత్తగా సభ్యత్వం తీసుకున్న వారికి పత్రాలు , రైతులకు ఎరువులను అందజేశారు. డీసీసీబీ పిఎసిఎస్ చైర్మన్ జక్కా రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నష్టాల్లో ఉన్న సొసైటీని లాభాల్లో నడిపించేందుకు పాలకమండలి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి జడ్పిటిసి దయాకర్ రెడ్డి వైస్ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్ సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్ నాగర్ కర్నూల్ మార్కెట్ డైరెక్టర్ హుసేని ఎంపీటీసీ లీలావతి పార్టీ మండల అధ్యక్షులు స్వామి సీఈవో నరేష్ అన్ని మండల పిఎసిఎస్ చైర్మన్లు డైరెక్టర్లు అన్ని గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు
వాటర్ ట్యాంక్ ప్రారంభం
కందనూలు: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 15వ వార్డులో శనివారం వార్డ్ కాన్సిలర్ ఇసాక్ మియా కొత్తగా ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ ను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వార్డులోని ప్రజలకు తడి,పొడి,చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కల్పన ,వైస్ చైర్మన్ బాబు రావు ,కాన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు..