Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ అర్బన్
వెల్దుర్తి మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం అరాచకాలపై గ్రామస్తులు బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ సురేష్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పాఠశాల హెచ్‌ఎం శ్రీకాంత్‌గౌడ్ విద్యార్థులను వేధిస్తున్నాడని వారు ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారులకు పలుమార్లు విన్నవించిన స్పంధించడం లేదని వారు చెప్పారు. పాఠశాలకు వచ్చిన హెచ్‌ఎం శ్రీకాంత్‌గౌడ్ ఫోన్‌లో బాతకాలు పెట్టడమే తప్ప ఏనాడు విద్యార్థులకు చదువులు చెప్పిన పరిస్థితులు లేవన్నారు. హెచ్‌ఎంను సస్పెండ్ చేయకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు స్వామి, కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.