Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా నాయకులు గ్యాదరి జగన్
నవతెలంగాణ - సిద్దిపేట
హౌజింగ్ బోర్డు కాలనీలోని దళితుల ఇండ్ల నిర్మాణాలను కూల్చివేయడం తగదని, వెంటనే ఆపేయాలని సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా నాయకులు గ్యాదరి జగన్ అన్నారు. ఈ విషయమై అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన దళితులు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రమణాచారికి బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏండ్ల కిందట ప్రభుత్వం దళితులకు పట్టాలిచ్చిందన్నారు. ప్రస్తుతం అందులో ఇండ్ల నిర్మాణం చేసుకుంటే నిబంధనల పేరిట కూల్చివేయడం సరికాదన్నారు. అంతేకాకుండా అక్కడ కనీస సౌకర్యాలైన డ్రెయినేజీ, రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, వెంటనే ఆ ధోరణి మార్చుకోవాలన్నారు. అలాగే ఇండ్ల నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గ్యాదరి రవీందర్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.