Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్
మెదక్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఆరు నెలలుగా ఆస్పత్రిలో ఉపసభాపతి చొరవతో సేవలు చాలా మేరకు మెరుగు పడ్డాయన్నారు. క్వాలిఫైడ్ స్కానింగ్‌ను రేడియాలజిస్ట్ సోమ,శుక్రవారాలలో సేవలంది స్తున్నామని తెలిపారు. నెలకు 500 వరకు ప్రసూతి స్కానింగ్‌లు చేస్తున్నా మన్నారు. అంతకు ముందు ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించేవారమన్నారు. ప్రభుత్వాస్పత్రిలో నెలకు 120 కాన్పులు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 140 నుంచి 150 వరకు జరుగుతున్నాయన్నారు. డిసిహెచ్‌ఎస్ నుండి రూ.8 లక్షల విలువ చేసే వివిధ పరికరాలను పంపిణీ చేశారన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఇచ్చి సహకరించాలని కోరారు.