Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న చౌకబారు ఆరోపణలు మానుకోవాలని టిఆర్‌ఎస్ యూత్ జిల్లా నాయకులు ఎల్ముల స్వామి అన్నారు. ఆదివారం సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి పట్ల కెసిఆర్‌కు ఉన్న చిత్త శుద్ధిని ఎవరూ శంకించలేరని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి పూటకోమాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళ పరుస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు తా ము అధికారంలో ఉన్నపుడు ఏం సాధించారో చెప్పాలన్నారు. ప్రాజెక్ట్‌లకు అనుమ తులు వచ్చినా పూర్తి చేయలేని అసమర్ధులు కాంగ్రెస్ నేతలని విమర్శించారు. ఇటీ వల గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన ఘనత సిఎం కెసిఆర్‌దే అని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలను మానుకోవాలన్నారు.