Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి
- ప్రారంభమైన ఎస్జీఎఫ్ అథ్లెటిక్ పోటీలు
నబతెలంగాణ-మెదక్
సాధించాలనే పట్టుదల, సంకల్పంతో ఉన్నప్పుడు విజయం తప్పకుండా సాధిస్తారని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-17 బాలబాలికలకు జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలను మెదక్ పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో కలెక్టర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటమి గెలుపునకు పునాది అని... కొందరు ఓటమిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇది ఎంతో బాధాకరమన్నారు. అనంతరం మెదక్ డీఈవో రమేశ్‌కుమార్ మాట్లాడారు. జిల్లా ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కిషోరుకుమారును అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ క్రీడల నిర్వహణకు నిధులు కేటాయించాలని, క్రీడా పరికరాలు, దుస్తులు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డికి విన్నవించారు. దీనికి తక్షణమే స్పందించిన కలెక్టర్ క్రీడల నిర్వహణకు రూ.50 వేలు కేటాయిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ క్రీడా కమిటీ సభ్యులు, పీడీ నాగరాజు, పీఈటీలు మధుసూదన్, దేవేందర్‌రెడ్డి, శ్రీనివాసరావు, చంద్రమోహన్, సుధాకర్, శ్యామ్, రవి, మహిపాల్, రాజేందర్, మనోహర్, రూపేందర్, శేఖర్, ప్రభాకర్, ప్రదీప్రెడ్డి, సుజాత, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్ బంకుల్లో నిబంధనలు పాటించాలి
పెట్రోల్ బంకుల యజమానులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటిం చాల్సిందేనని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని శారద ఫిల్లింగ్ స్టేషన్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ తూకాలను పరిశీలించారు. అనంతరం స్టాక్ రిజిష్టర్తో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణను పరిశీలించారు. పెట్రోల్ బంక్ మౌలిక వసతుల నిర్వహణపై కలెక్టర్ ధర్మారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకులలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఆయన వెంట జిల్లా సివిల్ సప్లయి ఆఫీసర్ శ్రీనివాస్, డీటీ సాదిక్ ఉన్నారు.