Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఎత్తేయొద్దని చలో ఢిల్లీ
- బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు
నవతెలంగాణ-సిద్దిపేటఅర్బన్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఎత్తివేయాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్నీ ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 5న జరిగే చలో ఢిల్లీ జయప్రదం చేయాలని తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రాజు కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను వేగవంతం చేస్తోందని దుయ్యబట్టారు. 44 చట్టాలను 4కోడ్‌లుగా కుదించాలని ప్రయత్నం చేస్తోందని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ బోర్డును ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ సంక్షేమం బోర్డులో సుమారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 42వేల కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డులో ఉన్నాయని తెలిపారు. వాటిని ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాలని, దారి మళ్లిం చాలని చూస్తోందన్నారు. దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత భవన నిర్మాణ కార్మికులపై ఉందన్నారు. దేశవ్యాప్తంగా కార్మికులకు కనీస వేతనాలు రూ.21వేలు నిర్ణయం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రోజు వారీగా కనీస కూలి తగ్గించాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, భవన నిర్మాణ కార్మికులకు రోజు వారీగా పని కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దన్నారు. ఇసుక కొరత, నిర్మాణ వస్తువులపై జీఎస్టీ పన్నులు వేయడంతో భవన నిర్మాణ రంగాల ఉపాధి దొరకడం లేదన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించా లని కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి డిసెంబర్ 5న నిర్వహించే చలో ఢిల్లీ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రేవంత్‌కుమార్, సంఘం జిల్లా అధ్యక్షులు జానకి రామచంద్రం, సత్యం, యాదగిరి, లక్ష్మణ్, బాలయ్య పాల్గొన్నారు.