Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
- 52వ గ్రంథాలయ వారోత్సవం
నవతెలంగాణ-కంది
పుస్తకాలు చదవడంతో జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గ్రంథాలయ 52 వారోత్సవాల సందర్భంగా ఆదివారం సంగారెడ్డి జిల్లా గ్రంథాలయం చైర్మెన్ నరహరిరెడ్డి ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ చంద్రశేర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చంద్రశేర్ రెడ్డి మాట్లాడారు. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ న్యూస్ పేపర్ పుస్తకాలు చదవడంతో జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు ఆయన అన్నారు. పుస్తకాలు చదవడంతో కొత్త కొత్త విషయాలను తెలుసుకోవచ్చని పుస్తక రచయితల గురించి వారు రాసిన చరిత్రను తెలుసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రజలు విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదువుకునే అలవాటు చేసుకోవాలని అని ఆయన అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రంథాలయాల చైర్మెన్ పట్లోళ్ల నరహరిరెడ్డి, జిల్లా ఎస్పీ చంద్రశేఖ ర్‌రెడ్డిని సన్మానించారు. అనంతరం నవ తెలంగాణ పుస్తక ప్రదర్శన ఆయన ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో గ్రంథా లయ కార్యదర్శి వసుంధర, కిషన్, శ్రీనివాస్, ప్రశాంత్ సిబ్బంది పాల్గొన్నారు