Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సకాలంలో సరైన చికిత్స అందక ప్రాణాంతకం
- రక్త పరీక్షల్లో నిర్దిష్టత లేని ఫలితాలు
- వ్యాధి ముదిరాక పెద్దాస్పత్రులకు
- చిన్నారులకు ఎక్కువగా ప్రబలుతున్న మహమ్మారి
- ఇటీవల ఇద్దరు మృతి
డెంగ్యూ అంటేనే గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ఇది ప్రాణాంతక విషజ్వరం. ఈ మహమ్మారి ఉమ్మడి మెదక్ జిల్లాలో చాపకింద నీరులా విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా జిల్లాలో అనేక ప్రాంతాలకు పాకింది. తీవ్ర జ్వరం.. భరించలేని కండరాలు.. ఎముకల నొప్పి వంటి ప్రధాన లక్షణాలతో రోజూ పదుల సంఖ్యలో ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇటీవల మెదక్ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. జ్వరం రాగానే ల్యాబ్స్‌ల్లో పరీక్షలు చేయించుకుంటే నిర్ధిష్టంగా రిపోర్టులు రావడం లేదు. దీంతో వైద్యులు రోగం తీవ్రతను బట్టి పరీక్షలకు ఆదేశిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
నవతెలంగాణ-మెదక్
గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఉమ్మడి మెదక్ జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. జ్వరం సోకగానే అది ఏ జ్వరమో తెలుసుకునేందుకు మెడికల్ ల్యాబ్‌లో పరీక్షలు చేయించినా అందులో నిర్దిష్టంగా వివరాలు రావడం లేదు. ఫలితంగా ఈ పరీక్షలే రోగుల ప్రాణాలు తీసేవిగా మారాయి. జిల్లాలో పలువురు ఈ జ్వరం వచ్చిందని తెలుసు కోలేక సాధారణ చికిత్సలు చేయించుకుంటున్నారు. తగ్గకపోవడంతో పెద్దాస్పత్రులకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందులో కొందరు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. మామూలుగా స్థానిక ఆస్పత్రికి వెళ్లే జ్వర పీడితులకు వారి రోగ తీవ్రతను బట్టి డాక్టర్లు వైద్య పరీక్షలకు ఆదేశిస్తున్నారు. ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, చికెన్‌గున్యా, డెంగ్యూ తదితర జ్వరాలు వచ్చినప్పుడు రక్త పరీక్ష కేంద్రాల నుంచి వచ్చే రిపోర్టులు రోగులతోపాటు డాక్టర్లనను సైతం గందరగోళానికి గురిచేస్తున్నాయి.
గడగడలాడిస్తున్న డెంగ్యూ..
డెంగ్యూకి కారణమయ్యే ఈడిన్ ఈజిప్ట్ దోమ (టైగర్) ప్రస్తుతం జిల్లాలో ఎక్కువగా ఉంది. నల్లగా ఉండే ఈ దోమ ఒంటి మీద తెల్లని చారలు ఉంటా యి. పగటి పూట మాత్రం కుట్టే మూతల్లేని నీళ్ల ట్యాం కులు, పాత టైర్లలో నిల్వ ఉన్న నీళ్లు, తారు రోడ్లు, సిమెంట్ మీద వర్షపు నీరు, ఇండ్లల్లో పూల కుండీలు, కూలర్లు, వాడకుండా వదిలి వేసిన పాత్రలు, తిప్పలు, చీకటిగా ఉండే మూలాలు కర్టెన్ వంటి వేలాడే వస్తు వులు, ఉపయోగించని గొడుగులు, అలంకార సా మాగ్రి కింద ఉంటాయి. కుట్టిన వారం తర్వాత హఠాత్తుగా తీవ్రమైన జ్వరం వస్తుంది. ఒళ్లు కదిలిం చలేని పరిస్థితి ఉంటుంది. ఎముకల కండరాల్లో నొప్పి, శరీరంపై పొక్కులు, దద్దుర్లు వస్తాయి.
ఒక్కో ల్యాబ్‌లో ఒక్కో రకంగా...
ఉమ్మడి జిల్లాలో సుమారు 200పైగా ప్రయివేట్ రక్త పరీక్ష్షా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఓ రోగి ఒకే రోజు జ్వరానికి సంబంధించి మూడు చోట్ల పరీక్షలు చేయించుకుంటే మూడు రకాల రిపోర్ట్స్ వస్తున్నాయి. అసలు డెంగ్యూకి సంబంధించిన ప్లేట్లెట్లు కౌంట్‌లో మరీ తేడాలున్నాయి. ప్లేట్లెట్ కౌంట్ లక్షకుపైగా ఉ న్నా డెంగ్యూ పాజిటివ్‌గా రిపోర్ట్ ఇస్తున్నారు. దీంతో రోగులు మాత్రమే కాదు వైద్యులు సైతం గందర గోళానికి గురవుతున్నారు.
మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం నాగా పూర్ గ్రామానికి చెందిన నరేందర్‌రెడ్డి కుమార్తె భవ్యా రెడ్డి (21) నర్సాపూర్‌లోని బీవీఆర్ ఐటీలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. పది రోజుల క్రితం భవ్యా రడ్డికి తీవ్ర జ్వరం రాగా హైదరాబాద్ లోని సుచిత్ర రష్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేసినా తగ్గ కపోవడంతో సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు డెంగ్యూ సోకినట్టు నిర్ధారించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భవ్యారెడ్డి పరిస్థితి వి షమించడంతో శనివారం మృతి చెందింది. మృ తురాలు ఇటీవలే క్యాంపస్ సెలక్షన్స్‌లో ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైంది.
బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్ళిన మెదక్ మండలం శివ్వాయిపల్లి గ్రామానికి చెందిన చాకలి రా ములు (45) పదేండ్లుగా కుటుంబంతో కలిసి మేడ్చ ల్‌లో నివాసం ఉంటున్నాడు. 15 రోజుల నుంచి రా ములు అస్వస్థతకు గురవడంతో ఓ ప్రయివేట్ ఆస్ప త్రిలో చికిత్స చేయించుకుంటున్నాడు. డెంగ్యూ వ్యాధి సోకినట్టు వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమిం చడంతో రాములు శనివారం మృతి చెందాడు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ భారిన పడి మృత్యు ఒడికి చేరుతున్న వారి సంఖ్య పదుల సంఖ్యలో ఉంది. అలాగే మంచం పడుతున్న వారి సంఖ్య కూ డా భారీగా ఉంటోది. అయితే అనేక కేసులునమోదు అవుతున్నా వైద్యా ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం అధికారికంగా ఎక్కడా డెంగ్యూ మరణాలు లేవని చెబుతుండటం గమనార్హం.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
ప్రజలు ఎవరికివారు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకో వాలి. జిల్లాలోని జిల్లా హాస్పిటల్ తోపాటు ఏరియా హాస్పటల్స్‌లో డెంగ్యూ కిట్లను అందుబాటులో ఉంచాం. జిల్లాలో 83 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎక్కువగా హైద రాబాద్‌కి వలస వెళ్లిన వారివే ఉన్నాయి. అడ్రస్ మన జిల్లాలో ఉండటంతో జిల్లాలో ఎక్కువగా నమోదైనట్టు కనిపిస్తోంది. దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.
- వెంకటేశ్వరరావు, జిల్లా వైద్యాధికారి, మెదక్