Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగదేవపూర్
ఆరుతడి పంటలపై మండల వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో జగదేవపూర్ మండల పరిధిలోని బస్వాపూర్, పీర్లపల్లి గ్రామాలల్లో రైతులకు అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు. సోమవారం మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌రావు, సర్పంచులు మమత ఇంద్రసేనారెడ్డి, యాదవరెడ్డిలు మాట్లాడుతూ వచ్చే రబి సీజన్‌లో ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట అర్బన్ : ఆరుతడి పంటలతో రైతులకు మేలు జరుగుతుందని ఈ పంటలపై కనీస అవగాహన కలిగుండాలని మండల వ్యవసాయ శాఖ అధికారి పరశురాంరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎల్లుపల్లి, పొన్నాల గ్రామాల్లో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని పొందొచ్చన్నారు. కార్యక్రమంలో ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బాల్ రంగం, ఎంపీపీ సవిత ప్రవీణ్‌రెడ్డి, సర్పంచ్ రేణుక శ్రీనివాస్, ఉప సర్పంచ్ కేకేరావు, పీఏసీఎస్ చైర్మెన్ ప్రవీణ్‌రెడ్డి, ఎంపీటీసీ మమతాయాదగిరి, ఏఈఓ సుస్మిత, వార్డు సభ్యులు సృజనసంపత్, రాజమణి భిక్షపతి పాల్గొన్నారు.
నంగునూరు : గ్రామాభివృద్ధికి ప్రజలందరూ ఐక్యంగా పనిచేయాలని సర్పంచ్ భిక్షపతి నాయక్ అన్నారు. మండలంలోని జేపీతండాలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల నిర్వహణ, యాసంగి పంటలో ఆరుతడి పంటలు, పారిశుధ్యం, ప్లాస్టిక్ సేకరణ, వారం వారం డ్రైడే, మరుగుదొడ్ల వాడకం, హరితహారంలో చెట్ల పెంపకం తదితర అంశాలపై గ్రామసభలో చర్చించారు. కార్య క్రమంలో పంచాయతీ కార్యదర్శి కుమారస్వామి, ఉపసర్పంచ్ పిల్లి ఆంజనేయులు, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్, ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామస్తులున్నారు.
గజ్వేల్ : రబీ సీజన్‌లో ఆరుతడి పంటలను రైతులు సాగు చేసుకోవాలని గజ్వేల్ జెడ్పీటీసీ పంగ మల్లేశం అన్నారు. గజ్వేల్ మండలం బూర్గుపల్లి, అనంతరావుపల్లి గ్రామాల్లో ఆరుతడి పంటలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మినుము, శనగ, పెసర, తదితర కూరగాయల పంటలను సాగు చేసుకోవాలన్నారు. వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలన్నారు. బూర్గుపల్లి సర్పంచ్ విజయవర్ధన్‌రెడ్డి, అనంతరావుపల్లి సర్పంచ్ మహేందర్, ఏవో గణేశ్, ఎంపీటీసీ రాజేశ్వరి, రైతులు, వార్డు సభ్యులు గ్రామస్తులు ఉన్నారు.