Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డిటౌన్
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే స్పందించి పరిష్కరించాలని అధికారు లను జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తూ సంబంధిత అధికా రులకు పరిష్కారం కోసం తగు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల నుండి వారి వారి సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం కలెక్టర్‌కు దరఖాస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాధికా రమణి, ఆర్డీఓ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మెదక్ : ప్రజావాణిలో వచ్చిన సమస్య లను త్వరితగతిన పరిష్కరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి జిల్లా అధికారు లను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూ లల నుంచి ప్రజలు ఫిర్యాదులను కలెక్టర్ ధర్మారెడ్డి అందజేశారు. జిల్లావ్యాప్తంగా 52 విజ్ఞప్తులు రాగా 31 రెవెన్యూ సమస్యలపైనే వచ్చాయి. ప్రధానంగా కౌడిపల్లికి చెందిన దళిత మహిళ గడ్డమీది పద్మకు చెందిన 12 గంటల భూమిని గ్రామానికి చెందిన వ్యక్తి కబ్జా చేసి తనని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని కలెక్టర్ ఎదుట వాపోయింది. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత తహసీల్దార్‌తో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యద ర్శిలు కలిసి తమకు సమాచారం ఇవ్వకుండానే తన ఇంటిని కూలగొట్టారని నిజాంపేటకు చెందిన లక్ష్మి కాంతారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సమస్య పరిష్కరించేలా చూడాలని అధికారి హనోక్‌ను ఆదేశించారు. తనకున్న 15గుంటల భూమిని సైతం కొందరు స్థానికులు ఆక్రమించారని, తన భూమి తనకు చెందేలా చూడాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సీతారామారావు, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయానికి ఆటంకం కల్గించొద్దు : ఎంపీటీసీ
తొగుట : రైతులకు రావాల్సిన పరిహారం వచ్చే వరకూ వ్యవసాయానికి ఆటంకం కల్గించొద్దని వేములఘట్ ఎంపీటీసీ గణపురం కల్పన మల్లేశం అధికారులను కోరారు. ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వారు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడారు. మలన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోతున్న వారికి న్యాయం చేసేంతవరకు ప్రజలకు అండగా ఉంటామన్నారు. మూడు నెలల్లో పరిహారం ఇస్తామని చెప్పి నేటికి 11 నెలలు గడుస్తున్నాయని గుర్తు చేశారు. హై కోర్టు ఆదేశాల మేరకు రైతులు నడుచుకుం టున్నారని, కానీ అధికారులు మాత్రం హైకోర్టును లెక్కచేయడంలేదని వారు ఆరోపించారు. పరిహారం వాయిదాల ప్రకారం కాకుండా ఒకే దఫాలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు రైతుల పట్ల సానుకూలంగా స్పందించాలని వారు కోరారు.