Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో వీ6 రిపోర్టర్ పరమేశ్వర్‌ను స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి దూషించడమే కాకుండా రిపోర్టర్ ఇంటి నిర్మాణం కూల్చి వేతకు నిరసనగా శుక్రవారం మెదక్ పట్టణంలో కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నిరసన తెలిపి అదనపు కలెక్టర్ నగేష్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు శంకర్, సురేందర్ రెడ్డి, నాగరాజులు మాట్లాడుతూ నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వార్తను టీవీలో ప్రసారం చేయగా, కక్షపూరితంగా రిపోర్టర్ పరమేశ్వర్‌ను దూషించడమే కాకుండా ఇంటి నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులతో కూల్చివేయడం ఎంతవరకు సమంజసమన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూల్చివేసిన ఇంటి నిర్మాణాన్ని కట్టించి ఇవ్వా లన్నారు. జర్నలిస్టులను బెదిరింపులకు గురిచేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. జర్నలిస్టు గోపాల్, శ్రీధర్, చారి, ప్రకాష్, శ్రీనివాస్,రహమద్ అలీ, వికాస్, కార్తీక్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.