Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళనలు నిర్వహించనున్నట్టు టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్ర సరళ, రాష్ట్ర కమిటీ సభ్యులు జగతి యాకయ్య తెలిపారు. మంగళవారం స్థానిక టీఎస్ యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో శాలిగౌరారం మండల శాఖ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలైన ప్రమోషన్స్, అంతర్ జిల్లా, సాధారణ బదిలీలు చేపట్టాలని, పండిట్, పీఈటీ పోస్టులు అప్ గ్రేడ్ చేయాలని ,మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు జరపాలని, పాఠశాలల్లో అన్ని క్యాడర్ల పోస్టులు టీఆర్‌టీి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
నూతన కమిటీ ఎన్నిక
టీఎస్ యుటిఎఫ్ శాలిగౌరారం మండలశాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా రాగి రాకేష్‌కుమార్, ఉపాధ్యక్షులుగా బొమ్మిడి శ్రీనివాసులు, సిహెచ్.యశోద, ప్రధాన కార్యదర్శిగా పుణ్య మూర్తి జయ సాగర్, కోశాధికారిగా అల్లం శంకర్ కార్యదర్శులుగా ఎం.చక్రపాణి ,ఎస్.కె సలీమ్ ఉద్దీన్, రేణుకాదేవి ,బి.రామకష్ణ రెడ్డి, శ్రీనివాసచారి,శకుంతల, మల్లేష్ , మంజుల, నరేందర్, మహిళ కమిటీ కన్వీనర్‌గా దేవయాని, మహిళా కమిటీ సభ్యులుగా సరిత, నాగరాణి, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా లింగయ్య, పత్రిక కన్వీనర్‌గా సైదులు, అకాడమిక్ కన్వీనర్‌గా ఎస్.కే అల్లాఉద్దీన్, క్రీడా విభాగం కన్వీనర్ గా టి వెంకన్న, సంస్కృతి కమిటీ కన్వీనర్‌గా కవిత, సోషల్ మీడియా కన్వీనర్‌గా శ్రీనివాస్ గౌడ్, జిల్లా మహాసభ ప్రతినిధులుగా పి.రాములు, శ్రీను, రఫీ, గోవర్ధన్ , ఆంజనేయులు, గౌరవ సలహాదారులుగా లింగారెడ్డి , కె మహబూబు రెడ్డి, రాములును ఎన్నుకున్నారు.