Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో రైతులపై నిర్బంధాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, 32 రైతు సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆరురోజులుగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నేతలతో చర్చలు జరపాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం,డీసీసీబీ మాజీ వైస్ చైర్మెన్ సయ్యద్ హాషాం,కుంభం కష్ణారెడ్డి డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సుభాష్ విగ్రహం దగ్గర కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్ సంస్కరణలు ఉపసంహరించుకోవాలని కోరుతూ చలో ఢిల్లీ వస్తున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపి లాఠీఛార్జి, భాష్పవాయు, వాటర్ క్యాన్లు ప్రయోగించిందన్నారు. రైతులపై కేంద్ర ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ రైతు ప్రజా సంఘాల నాయకులు చిన్నపాక లక్ష్మీనారాయణ ,ఎండి సలీం, దండెం పల్లి సత్తయ్య,అద్దంకి నరసింహ, కట్ట ప్రతాప్ రెడ్డి రాములు ,శాఖ వెంకటేశ్వర్లు,కల్లు రామకష్ణారెడ్డి,కట్ట అంజయ్య, వెన్నమల్ల నారాయణ ,మేడబోయిన మారయ్య ,భట్టు సత్తయ్య, బోనగిరి పార్వతమ్మ, మల్లయ్య చంద్రయ్య, వెంకన్న, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు