Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరి రూరల్
మండలంలోనీ అనాజీపురం, నాగిరెడ్డిపల్లె గ్రామాలలో చేపడుతున్న వివిధ అభివద్ధి పనుల నిర్మాణాలలో నాణ్యతను జడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాస రావు మంగళవారం ఎంపీడీవో నాగిరెడ్డితో కలిసి గ్రామాలలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో చేపడుతున్న వైకుంఠ గ్రామాలు, చెత్త డంపింగ్ యార్డ్ ల నిర్మాణం, పల్లె ప్రకతి వనాలు పనులను పరిశీలించారు. పనుల పురోగతి నాణ్యతా ప్రమాణాలను పరిశీ లించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఎద్దు నూరి ప్రేమలత మల్లేశం, జక్క కవిత రాఘ వేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.