Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరురూరల్:ఇటీవల కురిసిన వర్షాలకు ఆలేరు నుండి మోత్కూర్‌కు వెళ్లే రోడ్డుకు ఇరుపక్కల మట్టి కొట్టుకుపోయి ందని వెంటనే నిర్మించాలని టీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షులు రచ్చ రామ నరసయ్య కోరారు. మంగళవారం మండలంలోని సారాజిపేట గ్రామంలో ఆయన రోడ్డును పరిశీలించి మాట్లాడారు. సారాజిపేట చెరువు అలుగు పోయడంతో రోడ్డు కొట్టుకుపోయిం దన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు కల్వర్టులు నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కంనీ మహేందర్, తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు బండ మహేందర్, గ్రామ కో ఆప్షన్ నెంబర్ అశోక్ ,వార్డు సభ్యులు దూడల శ్రీధర్ ,నాయకులు మహేష్ ,రవి ,తదితరులు పాల్గొన్నారు.