Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మేక అశోక్ రెడ్డి
నవతెలంగాణ -రామన్నపేట
సీపీఐ(యం) సీనియర్ నాయకులు కూనూరు రామ స్వామి మరణం ప్రజా ఉద్యమా లకు తీరని లోటని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేక అశోక్ రెడ్డి, బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు. మండలంలోని బోగారం గ్రామం లో అనారోగ్యం తో మతి చెందిన కూనూరు రామస్వామి భౌతికకాయాన్ని అశోక్‌రెడ్డి సందర్శించి పార్టీ జెండాను కప్పి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామస్వామి గ్రామంలో పార్టీ, ప్రజా సంఘాల బలోపేతానికి కషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు బల్గూరి అంజయ్య, వైస్‌ఎంపీపీ నాగటి ఉపేందర్, సిరిపురం ఎంపీటీసీ బడుగు రమేష్, శాఖ కార్యదర్శి మెట్టు శ్రవణ్, మాజీ కార్యదర్శి కూనూరు మల్లేశం, బొడ్జుపల్లి మల్లేష్, కూనూరు నరేష్ , తదితరులు పాల్గొన్నారు.