Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నకిరేకల్:రాజకీయ దురంధరుడు, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో హైదరా బాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రజా జీవితంతో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు 1987 లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించి మండల అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రజా ప్రతినిధి ప్రస్థానంలో తొలి అడుగు వేశాడు. రెండోసారి కూడా మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1999 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సీపీఐ(ఎం) నుండి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభ పక్ష నాయకుడిగా పనిచేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2013లో టిఆర్‌ఎస్ పార్టీలో చేరి 2014లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి విజయం సాధించి ప్రస్తుతం శాసన సభ్యుడిగా కొనసాగుతున్నారు.
నోముల మృతికి సంతాపం
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మతికి శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ నేతి విద్యాసాగర్ సంతాపం వ్యక్తం చేశారు మంగళవారం స్థానిక మినీ స్టేడియంలో నోముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య , మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నోముల పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.టిపిసిసి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రవీందర్ ,టీఎస్ యుటిఎఫ్ నాయకులు యాట మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయ కులు యాస కరుణాకర్ రెడ్డి, పోతుల రామచంద్రయ్య మాచర్ల సైదులు బొబ్బిలి శేఖర్ రెడ్డి బాణాల రామ్ రెడ్డి పాల్వాయి అఖిల్ సంతాపం వ్యక్తం చేశారు.
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సంతాపం
సిపిఎం నకిరేకల్ మండల కమిటీ ఆధ్వర్యంలో సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మతికి సంతాపం వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో పార్టీ మండల కార్యదర్శి ఆకుల భాస్కర్ నాయకులు ఎస్ కే అమీర్ భాష, కొప్పుల అంజయ్య, పైళ్ల లింగయ్య ఉన్నారు
నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు పరిశీలన
నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు ఏర్పాటకటపే మంగళవానం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ, ఎస్పీ రంగనాథ్ పరిశీలించారు.నకిరేకల్ నుండి నోముల,పాలెం గ్రామా నికి వెళ్లే రహదారిని పరిశీలించి మరమ్మతులు చేయా లని అధికారులను ఆదేశించారు. అలాగే సొంతూరు పాలెం గ్రామంలో ఇంటిని, అంతక్రియలు జరిపే స్థలాన్ని, పార్కింగ్ ,హెలిప్యాడ్‌లకు స్థలాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అంత్యక్రియల కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నట్లు తెలుస్తుంది.