Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
కరోనా నేపథ్యంలో మార్చినెల నుండి ఇంటివద్దనే ఉన్న హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మొటిక్ చార్జీలను నగదురూపంలో ఇవ్వాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి దయానందరాణికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి వద్దనే ఉండి ఆన్లైన్ ద్వారా చదువు కొనసాగిస్తున్న హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మొటిక్ చార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కరోనా కాలంలో మార్చి నెల నుండి దశలవారీగా లాక్‌డౌన్ ప్రకటించడం, స్కూల్స్ ,కాలేజీలు మూతపడడంతో దళితులు,గిరిజనులు, బలహీన వర్గాల,మైనార్టీలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారన్నారు.తినడానికి తిండి లేని విద్యార్థులకు, అనాధ పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆనంద నిలయాల్లో చదివే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీరితో పాటు ఎస్‌ఎంఎచ్ హాస్టల్స్ లో ఉండే విద్యార్థిని విద్యార్థులకు వారి బ్యాంక్ అకౌంట్‌లో మెస్, కాస్మొటిక్‌చార్జీలు జమ చేయాలన్నారు.పేద కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా ఉన్నదన్నారు.కరోనా రెండో దశ ప్రారంభమవుతున్న సందర్భంగానైనా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క పేదరికాన్ని గమనించి మెస్, కాస్మొటిక్ ,హెయిర్ కటింగ్ బిల్లులను వెంటనే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కేవీ పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోమపంగు కిరణ్, జిల్లానాయకులు సోమపంగు సాయితేజ పాల్గొన్నారు.