Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అనంతగిరి
అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను అడ్డగించిన వ్యక్తిలపై దాడి చేసిన సంఘటన మండలపరిధిలోని కొత్తగూడెం గ్రామంలో చోటు చేసుకుంది.మంగళవారం బాధితులు భూక్యా అద్వాని, భూక్యావైకుంఠం తెలిపిన వివరాల ప్రకారం.. కొద్దిరోజులుగా గ్రామంలో పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు.ఈ నేపథ్యంలో రాత్రి సమయంలో గ్రామంలో ప్రజలకు నిద్ర లేకుండా ట్రాక్టర్ల శబ్దం అధికమవుతుంది.ఇందులో భాగంగా సోమవారం అర్ధరాత్రి నుండి పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా నడుస్తున్న ఇసుక రవాణాను గ్రామస్తులు వైకుంఠ,అద్వాని అడ్డగించి ఇసుక రవాణా నిలిపేయాలని ప్రశ్నించడంతో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వారిపై భౌతికంగా దాడికి పాల్పడ్డారని వాపోయారు.ఈవిషయంపై తహసీల్దార్‌కు ఇసుక రవాణాను అరికట్టాలని నిత్యం రద్దీగా తిరుగుతున్న ట్రాక్టర్ల మూలంగా గ్రామంలో రోడ్లు పాడవుతున్నాయని వెంటనే ఇసుక రవాణా నిలిపివేయాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.అనంతరం వారిపై దాడి చేసిన సదరు వ్యక్తుల పై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.