Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర్నా నిర్వహించిన గ్రామస్తులు
నవతెలంగాణ-కోదాడరూరల్
మండలంలోని రెడ్లకుంట గ్రామంలో అధికార పార్టీ నాయకులు పోలీసుల అండదండలతో జోరుగా ఇసుకదందా సాగుతుంది.మంగళవారం మండలపరిధిలోని రెడ్లకుంట గ్రామంలో అధికార పార్టీకి చెందిన నాయకులు ఇసుకదందా సాగిస్తున్నారు.గ్రామంలో పేదలు ఒక ట్రక్కు ఇసుక తీసుకెళ్దామనుకుంటే గ్రామంలోని టీఆర్‌ఎస్ నాయకులు పోలీసులకు చెప్పి పట్టిస్తున్నారని గ్రామస్తులు నిరసన తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు, టీఆర్‌ఎస్ నాయకులు సుమారు 500 ట్రక్కులకు పైగా ఇసుకను డంపింగ్ చేశారని, ఒక ట్రక్కు రూ.4 వేల నుండి రూ6. వేల వరకుఇసుకను గ్రామ పరిసర ప్రాంతాలకు అమ్ముతున్నా రెవెన్యూ అధికారులు,పోలీసు మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.ఇంటికి మరమ్మతులకు చేయించు కోవడానికి ఇసుకను తీసుకెళ్తుంటే పోలీసులతో బెదిరింపజేయడం అన్యాయ మన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి పాలేరు వాగులో ఇసుక దందా నిర్వహిస్తున్న టీిఆర్‌ఎస్ నాయకులను అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.