Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్
నవతెలంగాణ-సూర్యాపేట
సుదీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేస్తూ, సమాజానికి సేవలు అందించడం పోలీసు వ్యవస్థ మంచి వారధని ఎస్పీ ఆర్.భాస్కరన్ అభిప్రాయపడ్డారు.జిల్లాలోని గరిడేపల్లి మండలంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మీర్జాన్ జాఫర్‌బేగ్ మంగళవారం ఉద్యోగ విరమణ పొందారు.ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఉద్యోగ విరమణ పొందిన బేగ్ సేవలను అభినందిస్తూ సన్మానించి బహుమతి ప్రదానం చేశారు.పోలీసు శాఖ నుండి అందాల్సిన ఆర్థికసదుపాయాలను కూడా అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేయడం అదృష్టమన్నారు.బేగ్ ఇక ముందు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలన్నారు. సమాజసేవలోనే ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్, పోలీసు సంక్షేమ సంఘ అధ్యక్షులు రామచందర్‌గౌడ్, ఉద్యోగ విరమణ పొందిన సిబ్బంది కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా ఉద్యోగోన్నతి
జిల్లాలోని చివ్వెంల పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రాములు, చిలుకూరు పోలీసు స్టేషన్ నందు హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రీనివాసరావులకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఎస్పీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.అనంతరం సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగోన్నతితో బాధ్యత పెరుగుతుందని, మరింత బాధ్యతగా పని చేయాలన్నారు.సహోద్యోగులతో కలిసిమెలిసి ఉండాలని, ఉత్తమసేవలు అందించాలని సూచించారు.సమాజంలో పోలీసు ప్రతిభ పెరిగేలా ప్రజలకు చేరువ కావాలన్నారు.