Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
కేంద్రంలో మోడీ సర్కార్ తీసుకొచ్చిన మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలు రద్దు చేయకపోతే పతనం తప్పదని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేసే విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతాంగంపై నిర్బంధం ప్రయోగిస్తే ఊరుకోబోమని అఖిల భారత కిసాన్ సభ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ దొడ్డ వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ హెచ్చరించారు.వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతుగా వామపక్ష, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుంచి దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డులో లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తుంటే రైతాంగంపైన మోడీ సర్కార్ నిర్బంధాన్ని ప్రయోగించి రైతుల పైన లాఠీచార్జి చేయడం, భాష్పాయువులను ప్రయోగించడం అన్యాయమన్నారు.దేశంలో వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌శక్తులకు ధారాదత్తం చేస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతులతో చర్చలు జరిపి దొడ్డిదారిన తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలతో పాటు విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలన్నారు.రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికవర్గం మొత్తం రోడ్ల మీదకు వస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నెమ్మాదివెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్గూరి గోవింద్ ,తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు గుంజలూరు కోటయ్య, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, గంటా నాగయ్య, ఎస్‌కె.సయ్యద్,కునుకుంట్ల సైదులు, ఏఐటీయూసీ నాయకులు దంతాల రాంబాబు దోరేపల్లి శంకర్, గాలికృష్ణ, పాషా, రెమిడాలరాజు, తెలంగాణ రైతుసంఘం నాయకులు దండా వెంకటరెడ్డి, కొప్పుల రజిత,మందడి రాంరెడ్డి, ప్రజాసంఘాల నాయకులు పెద్ది వెంకట్రాములు మామిడి సుందరయ్య, సాయికుమార్, నర్సయ్య, తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు నర్సయ్య, జీఎంపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి పాల్గొన్నారు.