Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హాలియా
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రజావాణి వినిపించగల మంచి నాయకుడు నోముల నర్సింహయ్య అని, ఆయన అకాల మరణం చాలా బాధాకరంగా ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పెన్నా అనంతరామశర్మ అన్నారు. హాలియాలో ఆయన స్వగహంలో భౌతికకాయానికి వారు పూలమాలలేసి నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమ దశలోనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా సమస్యలను అధ్యయనం చేయడంలో చురుకైన పాత్ర పోషించేవారన్నారు.ప్రజా పోరాటాలు నిర్వహించడంలో ఉద్యమ ఎత్తుగడలో దూరదష్టితో అనేక ఉద్యమాలను విజయవంతం చేశారని, అలాంటి నాయకున్ని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ(ఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి అయిలయ్య, డబ్బికార్ మల్లేష్, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్, డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, బొజ్జ చిన్న వెంకులు, అవుతా సైదులు, రవినాయక్, నాయకులు ఖమ్మంపాటి శంకర్, ఆకారపు నరేష్, కోమండ్ల గురవయ్య, కొప్పు వెంకన్న, పొదిల వెంకన్న ఉన్నారు.