Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దమ్ముంటే గ్రామానికి కాంగ్రెస్ నాయకులు బహిరంగ చర్చకు రావాలి
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
మండల పరిధిలోని మాసాయిపేట లో దళితుల భూమి అడ్డుపెట్టుకుని మాజీ ఎమ్మెల్యే నగేష్, కాంగ్రెస్ నాయకులు అయోధ్య రెడ్డిలు రాజకీయం చేయడం మానుకోవాలని గ్రామ దళిత నాయకులు బర్ల శివయ్య, బర్ల ఈదయ్య లు కోరారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ నాయకులు బీర్ల అయిలయ్య 726 సర్వేనెంబర్‌లో ఉన్న అసైన్డ్ భూమికి హద్దులు పెట్టించి దళితులు కబ్జాల ఉండేవిధంగా చేశారన్నారు. ఇవన్నీ తెలియని నాయకులు వారి పైన విమర్శలు చేయడం తగదన్నారు. ఇప్పటికైనా గ్రామానికి వస్తే నిజానిజాలేమిటో చూపిస్తామన్నారు. ఎమ్మెల్యేపైఐలయ్య పై ఉన్న కోపాన్ని దళితులను అడ్డుపెట్టుకుని తీర్చుకోవడం సిగ్గుచేటన్నారు. వారి వెంట అసైన్డ్ భూమి పట్టాదారులు ఉన్నారు.
మండల పరిదిలోని మాసాయిపేట గ్రామంలోని 726 సర్వేనెంబర్ లో దళితుల భూమిని ఆక్రమించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడం అన్యాయమని వారి మధ్య ఉన్న వర్గ విభేదాలను ఎమ్మెల్యే దంపతులకు ఆపాదించడం తగదని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్ గౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్రే వెంకటయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మాసాయిపేటలో విలేకరులతో మాట్లాడారు.కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా విమర్శలు చేయడం మానుకోవాలన్నారు.యాదగిరిగుట్ట మండ లంలోని మాసాయిపేట లో కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన భూములు ఉంటే భువనగిరిలో ఎమ్మెల్యే దంపతులపై ఆరోపణలు చేయడం ఏంటని విమర్శించారు. దమ్ముంటే మాసాయిపేట గ్రామం లోనే బహిరంగ చర్చకు రావాలన్నారు. టిఆర్‌ఎస్ నాయకులు శ్రీశైలం,కొండిలెడ్డి లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అందులో భాగంగానే మాసాయిపేట లో కూడా శాస్త్రజ్ఞులు భూమిని న్యాయంగా కొనుగోలు చేసి అమ్మకాలు చేశారన్నారు. ఆ భూమి పక్కనే ఉన్న అసైన్డ్ ల్యాండ్ ను ఏ ఒక్కరూ ఆక్రమించ లేదని గ్రామ దళితులే చెబుతున్నారన్నారు. ఆయిన కాంగ్రెస్ నాయకులు మతి తప్పిన ఆలోచనలు చేయడం అవివేకమన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే దంపతుల పై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో నిరూపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ తోటకూర అనురాధబిరయ్య, సర్పంచ్ ఒంటేరు సువర్ణ,నాయకులు మిట్ట వెంకటయ్య, తోటకూర బీరయ్య, ఒంటేరు సురేష్ రెడ్డి, మిట్ట వెంకటయ్య, బాబురావు ,తదితరులు పాల్గొన్నారు.