Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ : నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో ఆకస్మిక మరణం తీరని ప్రజలకు లోటని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఆలేరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ కుడుదుల నాగేష్ బూడిద భిక్షమయ్యగౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు . రెండుసార్లు ఎంపీపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు చేసిన సేవలు మరువలేమని పేర్కొన్నారు. నర్సింహయ్య మతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
భువనగిరి : నాగార్జునసాగర్ సాగిస్తున్న సభ్యులు నోముల నర్సయ్య మతి పట్ల సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహాంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ సంతాపం ప్రకటించారు. ఆయన చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినాయక చౌరస్తా వద్ద జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు పుట్ట విరేష్ యాదవ్ హౌస్ శెట్టి రమేష్ సురేష్ చుక్కల శంకర్ రాసాల రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భువనగిరి రూరల్ : నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య యాదవ్ అకాలమరణానికి చింతిస్తూ మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి టిఆర్‌ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు జనగాం పాండు, నీల ఓం ప్రకాష్ గౌడ్, మాజీ ఎంపీపీ అధికం లక్ష్మీనారాయణ గౌడ్,నాయకులు, నరాల వెంకట స్వామి యాదవ్, సర్పంచులు జక్కా కవిత రాఘవేందర్ రెడ్డి, జిలుగు సతీష్ పవన్, పంతులు నాయక్ నోముల పాండురంగారెడ్డి, మాకొల్ సతీష్ యాదవ్, ఎం పి టి సి సామల వెంకటేష్, రమేష్, వినరు పాల్గొన్నారు.
మోత్కూరు: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మతి పట్ల బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ మాట్లాడుతూ వామపక్ష భావాలను అలవర్చుకుని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నుంచి అంచెలంచెలుగా ఎదిగారని, రెండుసార్లు సీపీఎం ఎమ్మెల్యే గా గెలిచి అసెంబ్లీలో బడుగు, బలహీన వర్గాల పక్షాన గొంతు వినిపించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ఎస్ నాయకులు డి. ఉపేందర్, కన్నెబోయిన బాలయ్య, పానుగంటి శ్రీను, యాదయ్య, కె. జనార్ధన్, సుధీర్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.