Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-యాదాద్రి
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా రాబోతున్నాయని, ప్రజా నిర్ణయం ఏకపక్షంగా ఉండబోతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పారు. మంగళవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనం చేశారు. అనంతరం కొండపైన పునర్నిర్మితమవుతున్న ప్రధానాలయ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి దీటుగా యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. కాకతీయులు, శ్రీకష్ణదేవరాయలు ఆలయాలు నిర్మించారని పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నామని, కానీ యాదాద్రిని నిర్మిస్తున్న సీఎం కేసీఆర్‌ను ప్రస్తుతం ప్రత్యక్షంగా చూస్తున్నామని ఆయన చెప్పారు. మతవిధ్వేషాలు రెచ్చగొట్టి, మతఘర్షణలు సష్టించి తెలంగాణలో చిచ్చుపెట్టాలని చూసేవారు ఎవరైనా సరే ఆ భగవంతుడే శిక్షిస్తాడని అన్నారు. మంత్రి వెంట టెంపుల్, వైటీడీఏ ఆఫీసర్లు ఉన్నారు.