Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
జాన్‌పహాడ్ దర్గా ఉర్సు తరహాలో మండలంలోని కాసరాబాద గ్రామ శివారులో 50 ఏండ్ల చరిత్ర గల హజ్రత్ సయ్యద్ జాన్ పాక్ షాయీద్‌షా, మోహిన్‌షా (దంతాల దర్గా) ఉంది.ఈ ప్రాంతంలోని కొన్నేండ్లుగా దర్గా సంతాన దర్గాగా విరాజిల్లుతుంది.దర్గా వద్ద కోరిన కోరికలు తీరుతాయని ఆయా గ్రామాల ప్రజలు చెప్పుకుంటారు.ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉర్సు నిర్వహించనున్నట్లు దంతాల కుటుంబ సభ్యులు తెలిపారు. దంతాల కుటుంబంనుంచి దర్గాకు గంధంరాకతో ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభంకానున్నాయి.దర్గా వద్ద ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.ప్రత్యేకంగా సంతానం లేని వారు దర్గాను దర్శించుకుని వారం వారం ప్రత్యేక పూజలు చేస్తే సంతానం కలుగుతుందని పరిసర ప్రాంత ప్రజల నమ్మకం.దీంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో సంతాన దర్గా విరాజిల్లుతుంది.ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు దంతాల వెంకన్న,రమేశ్, దంతాల కుటుంబీకులు కోరుతున్నారు.