Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య
నవతెలంగాణ-బయ్యారం
కరోనా కాలంలో పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు దేశ ప్రజలకు తీవ్ర హాని చేసే చట్టాలని అఖిల భారత రైతుకూలీ సంఘం(ఏఐకెేఎంఎస్) రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య అన్నారు. బుధవారం మండలంలోని పంది పంపుల, నారాయణపురం గ్రామాల్లో జరిగిన మోడీ వ్యవసాయ చట్టాల వ్యతిరేక ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. రెండు నెలలుగా ఢిల్లీ కేంద్రంగా రైతాంగం పెద్ద ఎత్తున చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నా పెట్టుబడిదారులకు భయపడి మోడీ ప్రభుత్వం చట్టాలను రద్దు చేయడానికి వెనకాడుతుందని అన్నారు. రైతులకు, దేశ ప్రజలకు హాని కలిగించే చట్టాలను ఆగమేఘాల మీద మోడీ ప్రభుత్వం తీసుకురావడం కార్పొరేట్‌ల కోసమేనని అన్నారు. ఈ చట్టాలు రద్దయ్యేవరకు, గిట్టుబాటు ధర చట్టాన్ని చేసేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు సనప పోమ్మయ్య, మోకాళ్ళ మురళీకష్ణ, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి బోనగిరి మధు, న్యూ డెమోక్రసీ మండల నాయకులు గంగారపు బిక్షం, కొమరయ్య, మేకపోతులు నాగేశ్వరరావు, అల్లిగూడెం, నారాయణపురం సర్పంచులు చింతల సుభద్ర, కుర్సం మాధవి, ప్రసాద్, పెద్ద బాలయ్య తదితరులు పాల్గొన్నారు.