Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చిట్యాల
కాటన్ బాక్స్‌లో పేలుడు పదార్థాలు లభ్యమైన సంఘ టన మండలంలోని గుండ్రాంపల్లి -సుంకనపల్లి గ్రామాల మధ్యలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శంకర్‌రెడ్డి, ఎస్సై నాగరాజు వివరాల ప్రకారం..గుడ్రాంపల్లి - సుంకనపల్లి గ్రామాల మధ్యలో స్థానికులు ఓ కాటన్ బాక్సును గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాక్స్‌ను పరిశీలించగా అందులో పేలుడు పదార్థాలు లభ్యమ య్యాయి. బాక్స్‌పై ఉన్న కోడ్ ఆధారంగా విచారించగా చిట్యాల శివారులోని ఐడియల్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీకి చెంది నదిగా గుర్తించారు. వాటిని చౌటుప్పల్‌కు చెందిన లైసెన్సెడ్ వెండర్ రాఘవేంద్ర ట్రేడర్స్‌కు చెందిన పి.శ్రీనివాస్ కొనుగోలు చేసినట్టు తేలింది. వాటిని వెస్ట్ గోదావరికి చెందిన ఎన్.శ్రీనివాస్‌రావు మునుగోడు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన కల్లు వెంకట్‌రెడ్డి, చిట్యాల మండల కేంద్రానికి చెందిన ఓర్సు రాజు, సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన దండుగుల మల్లేష్‌లకు విక్రయించాడని తేలిందన్నారు. వీరు వీటిని వ్యవసాయ పొలాల్లో ఉన్న రాళ్లను తొలగించడానికి వినియోగిస్తున్నారని తెలిసింది. ఈ కేసులో ఇద్దర్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు సీఐ తెలిపారు.