Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ -ఆలేరుటౌన్
నిరుద్యోగ యువతీ,యువకులు పోలీస్ ట్రైనింగ్ శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీస్ శిక్షణా శిబిరంలో ఆమె మాట్లాడారు. పోలీస్ శిక్షణ పొందినవారు డిఫెన్స్‌లో సైతం ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని చెప్పారు .ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు పీఈటీ పూల నాగయ్య యువకులకు శిక్షణ ఇచ్చేందుకు స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తున్నారని తెలిపారు . శిక్షణ పొందిన వారు పోలీస్ శాఖలో పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం పొందవచ్చని చెప్పారు. సమస్యలు తలెత్తినా ప్రమాదాలు జరిగినా ముందు స్పందించేది పోలీస్ శాఖ అని అన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్లో 270 మంది ఉంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా వారు 170 మంది ఉన్నారని ఎస్సై రమేష్ సభ ముఖంగా తెలిపిన సంగతిని గుర్తుచేశారు. ట్రైనర్స్ ను త్వరగా నియమించాలని రాచకొండ కమిషనరేట్ ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు చెప్పారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ జి.రవీందర్, మున్సిపల్ చైర్మెన్ వసపరి శంకరయ్య,విద్య అధికారిణి సి.రమణి, సీఐ జి.నరసయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్లు ,పుర ప్రముఖులు శిక్షణ పొందుతున్న వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు .