Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఏపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- కంటేనర్‌ను ఢ కొట్టిన ఆటో ఏడుగురు మృతి
- మృతుల్లో ఆరుగురు మహిళలు
- మరో 15 మందికి గాయాలు
- పది మంది పరిస్థితి విషమం
- మృతులంతా వ్యవసాయ కూలీలే
నల్లగొండ: నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాటు వేసేందుకు వచ్చిన కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బొలేరో వాహనాన్ని తప్పించబోయి కంటేనర్‌ను ఢ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. ఇందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు ఆయన తల్లి, భార్య కూడా మృతి చెందింది.