Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కేతెపల్లి
వీఆర్వోలకు భూరికార్డుల పనులు చెప్పొద్దని వీఆర్వోల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఠాగూర్ సురేంద్ర సింగ్ గురువారం తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో వీఆర్వోలను భూరికార్డుల పనుల నుండి తొలగించిన విషయం విధితమేనన్నారు. మళ్లీ అధికారులు భూ రికార్డుల సంబంధించిన పనులను తహసీల్దార్ కార్యాలయంలో చేయించుకుంటున్నారని చెప్పారు. తాము భూ రికార్డుల పనులు తప్ప ప్రభుత్వం చెప్పిన 56 విధులను మాత్రమే నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వీఆర్వోల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పెద్ద పాము శ్రీనివాస్ ,మండల అధ్యక్షుడు పోచయ్య, కార్యదర్శి సోమయ్య, వీఆర్వోలు ఎస్కె షరీఫ్, వి .రామారావు, జోజి బిక్షం, సైదులు పాల్గొన్నారు.