Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కపల్లి
మండలంలోని ముల్కలపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ తయారీలో ఇన్నోవేషన్ టాలెంట్ రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. గురువారం స్థానికంగా విద్యార్థినులు శైలజ, అనిత, హరికలను బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మెన్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య మాట్లాడుతూ పాఠశాలకు వాటర్‌ప్లాంట్, టేబుల్, ఐదు బేంచీలు ఇస్తానని చెప్పారు. దేవోజీనాయక్ తండాకు చెందిన వికలాంగుడు దిరావత్ బిక్యానాయక్‌కు రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ధనావత్ శంకర్ నాయక్డీ,సీసీ ఉపాధ్యక్షులు ఎలగల రాజయ్య డీసీసీ ప్రధాన కార్యదర్శి గుడిపాటి మాధసూదన్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టిసెల్ అధ్యక్షులు ధనావత్ భాస్కర్ నాయక్, ఎంపీటీసీలు కానుగంటి శ్రీనివాస్, బోరెడ్డి వనజ హన్మంత్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు గోగీకారి నాగమణి, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి డొంకేనా వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శి చాడ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.