Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కలెక్టరేట్
కళాశాల గ్రంథాలయ సమాచార కేంద్రం ఆధ్వర్యంలో ఈ - లైబ్రరీ తెలంగాణ మొబైల్ యాప్ విడుదల చేశామని కళాశాల ప్రిన్సిపాల్ రహత్ ఖాన్ తెలిపారు . సమాచార వనరులతో భవిష్యత్తునిర్మాణం వెబ్‌సైట్ బ్లాగ్ ద్వారా ఉచిత విద్య సమాచార వనరులను, ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాలను సమాజానికి డిజిటల్ యుగంలో తెలియజేయడం కోసం , యువతకు సులభమైన పద్ధతిలో సమాచారం అందుబాటులోకి తీసుకురావాలని చేసిన సాంకేతిక ప్రయత్నమన్నారు. ఉచిత అంతర్జాల సమాచార వనరులు, ఎలక్ట్రానిక్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ,ఈ బుక్స్, ఈ మ్యాగజీన్స్ ,ఈ జనరల్స్ ,స్వయంప్రభ, నేషనల్ డిజిటల్ లైబ్రరీ ,స్వయం , షోద గంగ పీహెచ్డీ పూర్తి సిద్ధాంత గ్రంథాలు ,అన్ని యూనివర్శిటీలో పరిశోధన గ్రంథాలు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ దేశంలో ఉన్న మొత్తం 935 యూనివర్సిటీలో పూర్తి సమాచారం ఉంటుందన్నారు.